ప్రియుడిని కిడ్నాప్ చేసిన ప్రియురాలు !

Telugu Lo Computer
0


బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయ్, భావనా రెడ్డి ఇద్దరూ ప్రేమించుకున్నారు.అయితే, చిక్‌బల్లాపూర్ జిల్లా నందిహిల్స్ సమీపంలోని ఓ రిసార్ట్‌కు వెళ్దామంటూ విజయ్‌ను భావన తీసుకెళ్లింది. ప్రియురాలే కదా పిలిచింది అని నమ్మి వెళ్లిన విజయ్‌కి అక్కడ మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఎదురైంది. భావన మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి విజయ్‌ను రిసార్ట్‌లోనే కిడ్నాప్ చేసింది. మూడు రోజుల పాటు గదిలో బందించి డబ్బులు వసూలు చేసింది. అంతటితో ఆగకుండా అతన్ని నానా హింసలు పెట్టింది. ఇక చేసేదేమి లేకపోవడంతో ఉన్నది మొత్తం ఇచ్చుకున్నాడు.. అతని నుంచి దాదాపు రూ. 21 లక్షలు వివిధ ఖాతాల్లోకి బదిలీ చేయించింది. విజయ్ కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు, బంగారు గొలుసును కూడా దోచుకున్నారు. ఆ తరువాత ఏదోలా వారి చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు కిలాడిని అదుపులోకి తీసుకున్నారు.  అతని నుంచి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె నుంచి డబ్బులను వసూలు చేసి,  కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు..

Post a Comment

0Comments

Post a Comment (0)