ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఏర్పడింది. సాధారణంగా ప్రతి సీజన్‌లోనూ జూన్ 1వ తేదీ నాటికి క్రమం తప్పకుండా కేరళ వద్ద తీరాన్ని తాకుతాయి. నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాల రాకలో తీవ్ర జాప్యం ఏర్పడింది. అయిదు సంవత్సరాల్లో నమోదైన నైరుతి రుతు పవనాల కదలికలను పరిగణనలోకి తీసుకుంటే- 2018లో మే 29, 2019లో జూన్ 8, 2010లో జూన్ 1, 2022లో జూన్ 3వ తేదీన అవి కేరళ తీరాన్ని తాకాయి. ప్రస్తుతం 5వ తేదీ వచ్చినా వాటి జాడ కనిపించట్లేదు. భారత వాతావరణ కేంద్రం ముందుగా వేసిన అంచనాల ప్రకారం ఈ నెల 4వ తేదీ అంటే ఆదివారం నాటికే రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉంది. సోమవారం కూడా రుతు పవనాల జాడ కనిపించలేదు. 7వ తేదీ వరకు అవి కేరళ తీరాన్ని తాకకపోవచ్చంటూ వాతావరణ కేంద్రం అభిప్రాయపడింది. అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతం గగనతలంపై 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరో 24 గంటల వ్యవధిలో అది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. క్రమంగా ఈ నెల 8 తేదీ తేదీ నాటికి తుఫాన్‌గా మారొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం రుతు పవనాల కదలికలపై ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం ఉందని స్పష్టం చేసింది. ఈ ఉపరితల ఆవర్తనం- వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుంది. అనంతరం క్రమంగా అరేబియా సముద్రం ఉత్తరం వైపునకు తన దిశను మార్చుకుంటుంది. తూర్పు మధ్య భాగంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ పరిస్థితులు కేరళ తీరం వైపునకు నైరుతి రుతుపవనాల పురోగతిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా వేసింది.ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
నైరుతి రాకలో మరింత జాప్యం !
June 05, 2023
0
Tags