అయోధ్య రామాలయం శరవేగంగా నిర్మాణమవుతోంది. సుదీర్ఘ వివాదాల తర్వాత 2020లో ప్రారంభమైన నిర్మాణ పనులు చకచకా సాగిపోతున్నాయి. మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయంలో మొదటి దశ తొలి అంతస్తు ఈ ఏడాది అక్టోబర్ నాటికి సిద్ధం కానుంది. వచ్చే జనవరి ఫస్ట్ కల్లా మిగిలిన పనులు పూర్తిచేసి సంక్రాంతి నాటికి గర్భగుడి లో దేవుడిని ప్రతిష్టించాలని రామాలయ ట్రస్ట్ పట్టుదలగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వచ్చేఏడాది జనవరి ఫస్ట్ నాటికి నిర్మాణం పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులను పరుగు తీయిస్తోంది రామజన్మభూమి తీర్థ ట్రస్ట్. మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయంలో మొదటి అంతస్తు చాలా వరకు పూర్తయింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి తొలి అంతస్తు నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది ఆలయ నిర్మాణ సమితి. దీపావళికి తొలి అంతస్తు సిద్ధం చేసి.. మిగిలిన పనులు డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తామని చెబుతున్నారు. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తవడం ఖాయంగా కనిపిస్తుంది.
దీపావళికి అయోధ్య రామాలయ తొలి అంతస్తు సిద్ధం
June 15, 2023
0
Tags