రోడ్‌ హిప్నాసిస్‌ వల్ల ప్రమాదాలు !

Telugu Lo Computer
0


రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండిషన్‌ సరిగ్గా లేకపోవడం, డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు కునుకు పడటం, రోడ్లు అధ్వానంగా ఉండటం కారణాలుగా భావిస్తుంటారు. అయితే ఎలాంటి ట్రాఫిక్‌ లేకుండా చక్కగా ఉన్న రోడ్లపై కూడా ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాన్ని పరిశీలించినప్పుడు పలు ప్రమాదాలకు 'రోడ్‌ హిప్నాసిస్‌’ సమస్య కారణమని నిపుణులు అంటున్నారు. రోడ్‌ హిప్నాసిస్‌ అంటే  వాహనం నడుపుతున్న వ్యక్తి కళ్లు చూస్తున్న విషయాలను బ్రెయిన్‌ గుర్తించదు, విశ్లేషించదు. దీంతో కళ్లు తెరిచి ఉండగానే ప్రమాదం జరుగుతుంది.  అయితే తాను ఆ స్థితిలో ఉన్నట్టు ఆ వ్యక్తి కూడా గ్రహించలేడు. ఆరోగ్య నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇలాంటి స్థితి లాంగ్‌ డ్రైవ్‌లో, ముఖ్యంగా ఎలాంటి మలుపులు లేని రోడ్లపై డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఏర్పడుతుంది. సిగ్నల్‌ లైట్లు, ట్రాఫిక్‌ లేకపోవడం, చాలా దూరం అదే రోడ్డు కనపడుతున్నప్పుడు సంభవిస్తుందని తెలియజేస్తున్నారు. ముంబై-నాగఫూర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన చాలా ప్రమాదాలు రోడ్‌ హిప్నాసిస్‌ వల్లే జరిగినట్టు మహారాష్ట్ర స్టేట్‌ హైవే పోలీసులు నిర్థారించారు. ఈ హైవే ప్రారంభమైన నాలుగు నెలల వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో 39 మంది మృతి చెందారు. దీంతో అధికారులు ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు, వాహనదారులు రోడ్‌ హిప్నాసిస్‌కు గురికాకుండా సైన్‌, మెసేజ్‌ బోర్డులు ఏర్పాటు వంటి చర్యలు తీసుకొంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)