జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి సోమవారం ఉదయం 10 గంటల 42 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇవాళ ఉదయం 7 గంటల 12 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. 27 గంటల 30 నిమిషాల పాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగనుంది. సోమవారం ఉదయం 10 గంటల 42 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం చేపట్టనున్న సందర్భంగా ఇస్రో అధిపతి డా. సోమనాథ్‌ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇస్రో నావిగేషన్‌ సేవల కోసం గతంలో పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాల్లో నాలుగింటికి జీవితకాలం ముగిసిందని, వాటి స్థానంలో ప్రతి ఆరునెలలకు ఒక ఉపగ్రహాన్ని పంపేలా సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)