ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న కార్మికులను మోడీ సత్కారించారు. వారికి శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద కొత్త పార్లమెంటు భవనం నిర్మించారు. అలాగే పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వ మత ధర్మ ప్రార్ధనలు నిర్వహించారు. సర్వ మత ధర్మ ప్రార్ధనల్లో ప్రధాని మోడీ, కేంద్ర మం త్రులు, ప్రముఖులు,వేద పండితులు పాల్గొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఖర్చు దాదాపు రూ. 20 వేల కోట్లు. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా కేంద్ర ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మించింది. అంతకుముందు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోడీకి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మోడీ నివాళులర్పించారు. అనంతరం అక్కడ జరిగిన యాగంలో పాల్గొన్నారు. స్పీకర్‌తో కలిసి మోడీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులను సన్మానించిన మోడీ !
May 28, 2023
0
Tags