కేరళలోని అశోక్‌కుమార్, సౌమ్య దంపతుల కుమార్తె ఆదిత్యశ్రీ. ప్రస్తుతం ఆమె వయసు 8 సంవత్సరాలు. క్రైస్ట్ న్యూ లైఫ్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. ఏప్రిల్ 24 సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మొబైల్ కు ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తున్న టైమ్ లో ఒక్కసారిగా మొబైల్ పెలిపోయింది. పెద్ద శబ్థం రావడంతో ఆదిత్యశ్రీ తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం అయ్యారు. కిందపడిపోయిన ఆదిత్యశ్రీని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆదిత్యశ్రీ చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు. చిన్నారి చేతిలో మొబైల్ ఫోన్ పేలటంతో చేతికి, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నచిన్న ఎలక్ట్రానిక్స్ రవ్వలు చిన్నారి ముఖానికి గుచ్చుకోవటంతోపాటు.. భారీ శబ్ధం రావటంతో చిన్నారి ఇంట్లోనే స్పృహ కోల్పోయింది. ఆ వెంటనే కారులో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తీవ్రగాయాలతోపాటు కరెంట్ షాక్ కూడా కొట్టిందని, అందుకే చిన్నారి చనిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు.
వీడియో చూస్తుండగా పేలిన సెల్ ఫోన్ !
April 25, 2023
0
Tags