కర్నాటకకు చెందిన షల్మాలీ అనే ఓ చిన్నారి పియానో వాయించే వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ కన్నడలో పాట పాడుతుండగా ఈ చిన్నారి ఇందుకు తగ్గట్టుగా పియానో ప్లే చేస్తోంది. అయితే ఈ షల్మాలీ టాలెంట్‌కు ఇంటర్నెట్ ఫిదా అవుతోంది. అందులో ప్రధాని మోడీ షేర్ చేయడంతో ఈ వీడియోకు మరిన్ని లైక్స్ షేర్స్ వస్తున్నాయి. "ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది. ఈ చిన్నారి టాలెంట్ అద్భుతం. షల్మాలీకు నా అభినందనలు" అంటూ మోదీ ట్వీట్ చేశారు. కేఎస్ నరసింహా అనే కవి రాసిన పల్లవగళ పల్లవియాలి అనే పాటను ఓ మహిళ పాడుతుండగా ఈ చిన్నారి పియానోపై ట్యూన్ వాయించింది.ఆ తర్వాత ఆ మహిళతో పాటుగా షల్మాలీ కూడా గొంతు కలిపింది. అయితే వీడియోలో కనిపించని ఆ మహిళ చిన్నారి తల్లి ఉంటుందని నెటిజెన్లు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు కాగానే ఆ వెంటనే ప్రధాని మోడీ షేర్ చేయడంతో ఐదు లక్షల రెట్లు ఎక్కువగా వ్యూస్ వచ్చాయి.అంతేకాదు ప్రధాని షేర్ చేయడంతో చాలా లైక్స్ కామెంట్స్ వచ్చాయి. ఈ చిన్నారి టాలెంట్‌ను కొందరు మెచ్చుకోగా, మరికొందరు ఈ బిడ్డను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులంటూ పోస్టు చేశారు. ఇంకొందరైతే ఈ చిన్నారికి కచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందేనంటూ రాసుకొచ్చారు. ఈ చిన్నారి చిరునవ్వు ఎంతో క్యూట్‌గా ఉండటంతో పాటు మనసును హత్తుకుంటోందంటూ మరికొందరు ట్వీట్ చేశారు.
ఈ చిన్నారి టాలెంట్ అద్భుతం !
April 25, 2023
0
Tags