జేడీఎస్‌కు ఓటు వేస్తే కాంగ్రెస్‌‍కు ఓటేసినట్టే !

Telugu Lo Computer
0


కర్ణాటక లోని బాగల్‌కోట్ మంగళవారంనాడు జరిగిన ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ కర్ణాటక సర్వతోముఖాభివృద్ధికి, శాంతి, సుస్థిరత కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్నడు లేనంత అవినీతి చోటుచేసుకుంటుందని, బుజ్జగింపు రాజకీయాలు, కుటుంబ రాజకీయలు, అల్లర్లు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. జేడీఎస్‌కు ఓటు వేయడమంటే కాంగ్రెస్‌కు ఓటు వేయడమే అవుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇటీవల బీజీపీ నుంచి ఆ పార్టీలో చేరిన నేతలపై ఆధారపడి పోటీ చేస్తోందని, ఆ పార్టీలో నాయకత్వ లేమి ఉందనే విషయం దీనినిబట్టే స్పష్టమవుతోందని అమిత్‌షా అన్నారు. జేడీఎస్‌కు ఓటు వేస్తే కాంగ్రెస్‌కు ఓటు వేయడమే అవుతుందని చెప్పారు. కాంగ్రెస్‌కు మీ ఓటు వెళ్లకూడదనుకుంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. బీజేపీ డబుల్ ఇంజన్ ఒకవైపు, రివర్స్ గేర్ కాంగ్రెస్ గవర్న్‌మెంట్ మరోవైపు ఎన్నికల బరిలో ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలంటే కేవలం ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం కాదని, రాష్ట్ర భవిష్యత్తును ప్రధాని మోదీ చేతిలో ఉంచడమని, కర్ణాటకను అభివృద్ధి పథంలో నడిపి, రాజకీయ సుస్థిరత నెలకొనేలా చేసే ఎన్నికలు ఇవని అమిత్‌షా వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)