రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా !

Telugu Lo Computer
0


కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆయన నేడు న్యూఢిల్లీలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్స్ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. కానీ కోవిడ్ పాజిటివ్ అని పరీక్షలో తేలాక ఆయన ఆ సమావేశానికి హాజరు కాబోడంలేదు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. డాక్టర్ల బృందం ఆయనను పరీక్షించి విశ్రాంతి తీసుకోవలసిందిగా సూచించారు. ఈ మధ్య కాలంలోనే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియాకు కూడా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆయన సోమవారం ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)