తమిళనాడు లోని రామనాథపురం జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి, రెండవ రోజైన బుధవారం ఎట్టివయల్ ప్రాంతంలో రైతులతో భేటీ అయ్యారు. ఆ సమయంలో రైతులందించిన తాటి కల్లుని గవర్నర్ సేవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూ వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడినని తెలిపారు. ప్రపంచానికే ఆహారం అందించే స్థాయికి దేశం అభివృద్ధి చెందిందన్నారు. ఆంగ్లేయుల రాకతో వారి కోసం వాణిజ్య పంటలు అధికంగా సాగుచేశారని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
తాటి కల్లు తాగిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి
April 20, 2023
0
Tags