అనురాగ్ మాలూ ఆచూకీ లభ్యం !

Telugu Lo Computer
0


పర్వతారోహకుడు అనురాగ్ మాలూ ఆచూకీ లభ్యమైంది. మౌంట్ అన్నపూర్ణ అధిరోహించిన ఆయన గత వారం మిస్సయ్యాడు.  విషమ పరిస్థితుల్లో ఉన్న ఆయన్ని హాస్పిటల్‌కు తరలించారని సోదరుడు సుధీర్ వెల్లడించాడు. గత వారం కొంత మంది పర్వతారోహకులతో కలిసి అనురాగ్ మౌంట్ అన్నపూర్ణ ఎక్కాడు. అయితే ఏప్రిల్ 17వ తేదీన దిగుతున్న సమయంలో ఆరు వేల మీటర్ల ఎత్తులో అతను జారిపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా 8 వేల మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న 14 పర్వతాలను ఎక్కాలన్న లక్ష్యంతో అనురాగ్ మాలూ ఉన్నారు. యూఎన్ గ్లోబల్ గోల్స్ అందుకునే లక్ష్యంతో అతను ఈ మిషన్ చేపట్టారు. రెక్స్ కారమ్ వీర్ చక్ర అవార్డును అతను గెలుచుకున్నాడు. 2041 అంటార్కిటికా యూత్ అంబాసిడర్‌గా ఇండియా నుంచి ఎంపికయ్యాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)