ఈక్వెడార్‌ బీచ్‌లో ముగ్గురు యువతుల దారుణ హత్య

Telugu Lo Computer
0


ఈక్వెడార్‌లోని క్వినెడే సమీపంలో ఓ బీచ్‌లో ఏప్రిల్ 4న డెన్నిసి రేనా(19), యులియానా మాసియస్(21), నయేలి తాపియా(22) అనే ముగ్గురు యువతులు సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఐఅయితే ఏం జరిగిందో తెలియదుగానీ బీచ్‌ ఒడ్డున కొందరు దుండగులు ముగ్గురు యువతులను వెంబడించి చాలా దూరం తరమారు. ఈ క్రమంలో భయభ్రాంతులకు గురైన యువతులు తాము ప్రమాదంలో ఉన్నామని తెల్పుతూ సన్నిహితులకు వేర్వేరు మెసేస్ లు పంపారు. నయేలి తన సోదరుడికి రాత్రి 11:10 గంటలకు వాట్సప్ మెసేజ్ పంపింది. సోదరుడు వెంటనే ఫోన్‌ చేయగా ఆమె ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. మరో యువతి డెన్నిస్ హత్యకు గురికావడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్‌కు ‘నాకేదో ప్రమాదం జరగబోతుంది. ఒకవేళ నాకేదైనా జరిగితే, గుర్తుంచుకో ఐ లవ్‌ యూ వెరీ మచ్‌’ అని మెసేజ్ పంపింది. ఈ తర్వాత రోజే వారు బీచ్‌లో అర్ధనగ్నంగా శవాలైతేలారు. గుర్తుతెలియని వ్యక్తులు చిత్రహింసలకు గురిచేసి గొంతుకోసి హతమార్చి, ఇసుకలో పూడ్చి పెట్టారు. ఏప్రిల్ 5న చేపలవేటకు వెళ్లిన జాలర్ల కుక్క బీచ్‌లో ఓ చోట కాళ్లతో తవ్వడం ప్రారంభించింది. అక్కడకు వెళ్లి చూడగా ముగ్గురి యువతుల శవాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ హత్యలు ఎవరు చేసి ఉంటారనే విషయంపై పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు. మృతుల్లో ఒకరైన నయేలికి వివాహమై ఓ బిడ్డకు తల్లి. ఆమె ఫేమస్‌ సింగర్‌ కూడా. ఇక యులియానా మాసియస్ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్ధి.

Post a Comment

0Comments

Post a Comment (0)