తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామానికి చెందిన సునే సురేష్ కు చిన్న పెంకుటిల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక ఫ్యాన్, ఒక బల్బు ఉంది. సురేష్ కు ఏప్రిల్ నెలకు సంబంధించి కరెంట్ బిల్లు వచ్చింది. బిల్లు చూసిన సురేష్ ఒకేసారి షాక్ గురయ్యాడు. తన ఉంటికి రూ.53,747 బిల్లు రావడమేంటని ఆశ్యర్యపోయాడు. వెంటనే విద్యుత్ అధికారుల వద్దకు పరుగు తీశాడు. చిన్న ఇంటికి ఇంత బిల్లు రావడమేంటి సార్ ! ఏదో పొరపాటు జరిగి ఉంటుందని సురేష్ చెప్పాడు. కానీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం వచ్చిన బిల్లు కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. తాను కూలీ పనులు చేస్తూ జీవిస్తానని, తన వద్ద అంత డబ్బు లేదని, దయచేసి తనను ఇబ్బందుల్లో పెట్టొద్దని కోరాడు. అయినా పట్టించుకోని అధికారులు బిల్లు కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. సురేష్ వద్ద అంత డబ్బు లేకపోవడంతో బిల్లు చెల్లించలేకపోయాడు. దీంతో అధికారులు సురేష్ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ను తొలగించారు. చేసేది ఏమిలేక సురేష్ కుటుంబం కారు చీకట్లోనే ఉంటున్నారు. విద్యుత్ అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా బిల్లు కడితేనే విద్యుత్ ఇస్తామని స్పష్టం చేశారు. సురేష్ కు రూ.50 వేలకు పైగా బిల్లు రావడంపై గ్రామస్థులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదో తప్పు జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఒక ఫ్యాన్, ఒక బల్బుకు కరెంటు బిల్లు రూ.53,747 !
April 19, 2023
0
Tags