కోడిగుడ్లు అప్పు ఇవ్వలేదని కిడ్నాప్

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్‌పూర్ జిల్లా బర్తోరి గ్రామానికి చెందిన యోగేశ్ వర్మ అనే వ్యక్తి తమ గ్రామంలో బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. ఈ దుకాణానికి కోహ్రాడా గ్రామానికి చెందిన దీపక్ చతుర్వేది, రాహుల్ కుమార్ భాస్కర్, పరమేశ్వర్ భరద్వాజ్ ఈ నెల 20వ తేదీన బిలాస్‌పూర్ గ్రామానికి వచ్చారు. తమకు కోడిగుడ్లు అప్పుగా ఇవ్వాలని కోరగా, అందుకు యోగేశ్ వర్మ అంగీకరించలేదు. దీనిని అవమానంగా భావించి యువకులు.. అదే రోజు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో యోగేశ్ వర్మను కిడ్నాప్ చేసి కారులో ముక్తిధామ్‌కు తీసుకెళ్లి, అతనిపై దాడిచేశారు. ఈ కిడ్నాప్‌పై బాధితుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు తక్షణం స్పందించి, కొన్ని గంటల్లో ఈ కిడ్నాప్‌ను ఛేదించి, యోగేశ్ వర్మను విడిపించారు. నిందితులపై కిడ్నాప్, దాడి, హత్యాయత్నం, బెదిరింపులు వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)