బస్సును ఢీకొన్న ట్రక్కు : నలుగురు మృతి

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో ప్రైవేట్ బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. దాదాపు 22మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సును ఢీకొట్టిన ట్రక్కు బోల్తా పడింది. ముంబై-పూణే హైవే పై ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు . పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)