సెప్టెంబరులో భారత్ కు రానున్న జో బైడెన్‌

Telugu Lo Computer
0


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ఏడాది సెప్టెంబరులో భారత పర్యటనకు రానున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్‌ భారత్‌కు రానుండటం ఇదే మొదటిసారి. భారత్ జీ 20 కి నాయకత్వం వహిస్తున్న వేళ బైడెన్ భారత్ కు వస్తున్నారు. ఈ -20 సమావేశంలో పాల్గొంటారు. బైడెన్‌ పర్యటనను పురస్కరించుకుని ఇండియా-యుఎస్‌ ఫోరమ్‌ ప్రత్యేక కార్యక్రమాలను ఢిల్లీలో ఏర్పాటు చేయనుంది. బైడెన్ భారత్ పర్యటనపైన ఆసక్తిగా చూస్తున్నామని బైడెన్ ప్రభుత్వంలోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రతినిధి డొనాల్డ్ లూ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో పాటుగా అమెరికా మంత్రులు జానెత్ యెల్లెన్, గినా రైమోండో , ఆంటోని బ్లింకెన్ లు కూడా ఇక్కడ పర్యటించనున్నారు. సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగే భారత్ , అమెరికా ఫోరమ్ లో మంత్రులతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొంటారు. 2023 చాలా గొప్ప ఏడాదిగా డొనాల్డ్ లూ అభివర్ణించారు. అపెక్ కు అమెరికా, జీ 7 కు జపాన్ , జీ 20 కి భారత్ నాయకత్వం వహిస్తున్నాయన్నారు. క్యాడ్ కూటమి సభ్య దేశాలు నాయకత్వ పాత్ర చేపట్టడం గొప్పవిషయంగా పేర్కొన్నారు. ఈ సమావేశాలు ఎన్నో అవకాశాలు కల్పించడంతో పాటు క్వాడ్ కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని లూ అభిప్రాయపడ్డారు. ఇక జీ20 కి భారత్ న్యాయకత్వం వహించడం మరింత శక్తిని ఇస్తుందని లూ చెప్పుకొచ్చారు. భారత్ జీ 20 కి నాయకత్వం వహిస్తున్న సమయంలో ప్రపంచానికి మంచిచేసే దిశగా భారత్‌ మరింతగా శక్తిమంతంగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. ఖ్వాడ్ లో అమెరికాతో పాటుగా భారత్, జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయని గుర్తు చేసారు. జపాన్‌ ప్రస్తుతం జీ-7కు ఆతిథ్యం అందిస్తోందని చెప్పారు. తామంతా ఏదో ఒక విధంగా ప్రపంచ బాధ్యతల్లో ఉంటూ.. మరింత సన్నిహితులమయ్యామని వివరించారు. ఎన్నెన్నో అద్భుతాలకు ఈ పర్యటన తప్పక మంచి సందర్భం అవుతుందని లూ వ్యాఖ్యానించారు. బైడెన్‌ బృందంలో విదేశాంగ శాఖ మంత్రి టోనీ బ్లింకేన్‌, ఖజానా శాఖ మంత్రి జానెట్‌ యెలెన్‌, వాణిజ్య మంత్రి గినా రైమండో ఉంటారని వెల్లడించారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో భారత్ లో బైడెన్ పర్యటన పైన ఆసక్తి కొనసాగుతోంది. ఈ పర్యటన వేళ రెండు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)