సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థపై తనకున్న ప్రతికూలమైన అభిప్రాయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి వ్యక్తం చేశారు. కొలీజియం అంశం గురించి మాట్లాడను అంటూనే....'అదంతా ఓ మైండ్ గేమ్' అని వ్యాఖ్యానించారు. వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకాలు సహా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన పలు సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న విషయమై విలేకరులు ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. 'కొలీజియం అంశమంతా ఓ మైండ్ గేమ్. దాని గురించి మాట్లాడదలచుకోలేదు' అని రిజిజు శనివారం ఇటానగర్‌లో అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 4జీ సేవల కోసం నిర్మించిన 254 మొబైల్ టవర్లను ప్రారంభించిన కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కొలీజియం వ్యవస్థ అనేది రాజ్యాంగంలోనే లేదని, న్యాయమూర్తులే న్యాయమూర్తులను ఎంపిక చేసే విధానాన్ని మార్చాలని కిరణ్ రిజిజు తరచూ వ్యాఖ్యానించే విషయం తెలిసిందే.
అదంతా ఓ మైండ్ గేమ్ !
April 23, 2023
0
Tags