గిట్టుబాటు ధర లేక ఉల్లి పంటకు నిప్పంటించిన రైతు

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఒక రైతు తన ఉల్లి పంటకు నిప్పంటించాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలపై కోపంతో సుమారు 1.5 ఎకరాల ఉల్లి పంటకు  కృష్ణ డోంగ్రే అనే రైతు నిప్పంటించాడు. పంట కోసం సుమారు రూ. 1.5 లక్షలు ఖర్చు పెట్టానని, ఆ తర్వాత వాటి రవాణా కోసం సుమారు రూ. 30 వేలు అదనంగా ఖర్చు చేశానని వాపోయాడు. ఇంత చేస్తే చివరికి ఉల్లి ధర మార్కెట్లో కేవలం తన్ను రూ. 25 వేలు పలుకుతోందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగు నెలలుగా రాత్రి, పగలనక కష్టపడి 1.5 ఎకరంలో ఉల్లి పంట పండించాను, దాన్ని ఇప్పుడూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాల వల్ల కాల్చేయాల్సి వచ్చిందని ఆవేదనతో చెప్పాడు. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించి రైతులకు అండగా నిలవాలని కోరాడు. ఈ ఘటన జరిగి 15 రోజుల అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాధికారి రాకపోగా, కనీసం సానుభూతి కూడా చూపలేదన్నాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)