మెడిటేషన్ సెల్‌ కోరిన సిసోడియా

Telugu Lo Computer
0


లిక్కర్ పాలసీ స్కామ్ లో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ప్రత్యేక కోర్టు శనివారంనాడు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిచండంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. జైలులో ఆయనకు 'భగవద్గీత'ను కోర్టు అనుమతించింది. 'మెడిటేషన్ సెల్'కు అనుమతించాలని కూడా కోర్టును సిసోడియా కోరారు. సిసోడియా సీబీఐ కస్టడీ సోమవారంనాడు ముగుస్తుండటంతో ఆయనను రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు మధ్యాహ్నం హాజరుపరిచారు. ఆయన కస్టడీ పొడిగింపును సీబీఐ కోరకపోవడంతో ఈనెల 20వ తేదీ వరకూ ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఆదేశాలిచ్చారు. వైద్య పరీక్షల్లో వైద్యులు సూచించిన మందులతో పాటు, కళ్లజోడు, డైరీ, ఒక పెన్ను, భగవద్గీత ప్రతిని సిసోడియా తనతో తీసుకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. తనను మెడిటేషన్ సెల్‌లో ఉంచాలంటూ సిసోడియా చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)