రైల్వే శాఖ కొత్త లగేజీ నిబంధనలు జారీ !

Telugu Lo Computer
0


ఇప్పటి వరకు అదనపు లగేజీతో ప్రయాణించే వ్యక్తుల పట్ల రైల్వే డిపార్ట్ మెంట్ చూసి చూడనట్లు గా వ్యవహరించింది. కానీ ఇప్పుడు అలా కుదరదు. దీనిపై కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇది విమాన ప్రయాణం వలె రైలు ప్రయాణికులు కూడా అదనపు లగేజీని తీసుకువెళ్లడానికి చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. రైళ్లలో అధిక లగేజీతో ప్రయాణించవద్దని రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రజలకు సూచించింది.  'ప్రయాణంలో మీ వెంట వస్తువులు ఎక్కువగా ఉంటే ఆ ప్రయాణంలో ఆనందం సగం ఉంటుంది ! ఎక్కువ లగేజీతో రైలులో ప్రయాణించవద్దు. ఇంకా ఎక్కువ ఉంటే పార్శిల్ ఆఫీసుకి వెళ్లి లగేజీ బుక్ చేసుకోండి' అంటూ మంత్రిత్వ శాఖ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఫస్ట్ క్లాస్‌ AC లో మీరు ప్రయాణిస్తుంటే 70 కిలోల వరకు ఉచితంగా అనుమతించబడుతుంది. AC 2-టైర్ లో పరిమితి 50 కిలోలు. AC 3-టైర్ స్లీపర్, AC చైర్ కార్ మరియు స్లీపర్ క్లాస్‌లలో 40 కిలోల వరకు లగేజీ అనుమతించబడుతుంది. సెకండ్ క్లాస్ లో  ఈ పరిమితి 25 కిలోల వరకు ఉంటుంది. లగేజీకి కనీస ఛార్జీ రూ.30 ఉంటుంది. 70-80 కిలోల వరకు అదనపు సామాను తీసుకెళ్లడానికి ప్రయాణికులు తమ బ్యాగేజీని బుక్ చేసుకోవాలి. ప్రయాణించే రైలు బయలుదేరే సమయానికి కనీసం 30 నిమిషాల ముందు బుకింగ్ స్టేషన్‌లోని లగేజీ కార్యాలయంలో క్యారీ-ఆన్ లగేజీని తప్పనిసరిగా సమర్పించాలి. టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు తమ లగేజీని కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఏదైనా రైల్వే ప్రయాణికుడు అదనపు మరియు బుక్ చేయని బ్యాగేజీని తీసుకువెళితే బ్యాగేజీ విలువకు ఆరు రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు  ఒకరు 40 కిలోల అదనపు లగేజీతో 500 కి.మీ ప్రయాణిస్తున్నట్లయితే ప్రయాణికుడు దానిని రూ.109 చెల్లించి లగేజీ వ్యాన్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ప్రయాణ సమయంలో ప్రయాణికుడు అదనపు లగేజీతో పట్టుబడితే.. రూ.654 జరిమానా చెల్లించాల్సివుంటుంది. తస్మాత్ జాగ్రత్త !

Post a Comment

0Comments

Post a Comment (0)