ఐఆర్‌సీటీసీ వాయిస్ ఆధారిత ఇ-టికెట్ బుకింగ్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. రాబోయే మూడు నెలల్లో ఆస్క్ దిశా ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లో AI – పవర్డ్ వాయిస్ ఆధారిత టికెట్ బుకింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఈ దిశగా ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌లో ‘ ఆస్క్ దిశా ‘ అనే ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇది కస్టమర్‌లకు ఆన్‌లైన్ టికెటింగ్ బుకింగ్ ప్రాసెస్‌లో వాయిస్ కమాండ్‌లను ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. దీనికి సంబంధించిన మొదటి దశ టెస్టింగ్ ప్రక్రియ విజయవంతమైందని తెలుస్తోంది. ఐఆర్‌సీటీసీ వాయిస్ ఆధారిత ఇ-టికెట్ బుకింగ్ ఫీచర్‌ను విడుదల చేయడానికి ముందు మరికొన్ని టెస్ట్ లను త్వరలో నిర్వహించాలని భావిస్తోంది. “ఆస్క్ దిశ” అనేది ప్రయాణీకుల సందేహాలకు సమాధానం ఇవ్వడానికి ఐఆర్‌సీటీసీ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం. ఇది ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, ఆస్క్ దిశ కస్టమర్‌లు ఓటీపీ ధృవీకరణ లాగిన్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి మరియు ఇతర సేవలకు మద్దతుని పొందేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి వినియోగదారులు తమ ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. ఏఐ - ఆధారిత ఇ-టికెటింగ్ ఫీచర్ ఐఆర్‌సీటీసీ బ్యాకెండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగు పరుస్తుందని కూడా భావిస్తున్నారు. రాబోయే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ వెర్షన్ ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ చాట్‌బాట్ ఆస్క్ దిశ 2.0 సహాయంతో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఆస్క్ దిశ 2.0తో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి, కస్టమర్‌లు చాట్‌బాట్ కోసం టెక్స్ట్ లేదా వాయిస్ కమాండ్‌లను ఉపయోగించవచ్చు. ఆస్క్ దిశ 2.0 కస్టమర్‌లు వారి టిక్కెట్‌లను రద్దు చేయడానికి మరియు రద్దు చేసిన టిక్కెట్‌ల వాపసు స్థితిని కూడా తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు ప్లాట్‌ఫారమ్ నుండి వారి పిఎన్ఆర్ స్థితి కోసం చాట్‌బాట్‌ను కూడా అడగవచ్చు. ఆస్క్ దిశ 2.0 ప్రయాణీకులను వారి రైలు ప్రయాణం బోర్డింగ్ మరియు గమ్యస్థాన స్టేషన్‌ను మార్చడానికి కూడా అనుమతిస్తుంది. ప్రయాణీకులు ఐఆర్‌సీటీసీ ఏఐ - పవర్డ్ చాట్‌బాట్‌ని ఉపయోగించి తమ ప్రయాణానికి సంబంధించిన రైలు టిక్కెట్‌లను ప్రివ్యూ చేయవచ్చు, ప్రింట్ చేయవచ్చు మరియు షేర్ చేయవచ్చు. ఆస్క్ దిశ 2.0 లో ప్రయాణీకులు రైలు ప్రయాణానికి సంబంధించిన వారి ప్రశ్నలకు సమాధానాలను కూడా పొందవచ్చు. ప్రయాణీకులు ఐఆర్‌సీటీసీ చాట్‌బాట్ ఆస్క్ దిశ 2.0కి ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ప్రశ్నలు అడగవచ్చు. ఐఆర్‌సీటీసీ బెంగళూరుకు చెందిన CoRover Pvt అనే స్టార్టప్ సహాయంతో ఆస్క్ దిశ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది. 2018 అక్టోబర్లో ఐఆర్‌సీటీసీ వినియోగదారుల కోసం AI-ఆధారిత టిక్కెట్-బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేసింది.
ఐఆర్‌సీటీసీ వాయిస్ ఆధారిత ఇ-టికెట్ బుకింగ్ !
March 05, 2023
0
Tags