పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. విదేశాల్లోనూ బన్నీ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజమ్స్‌ను పలువురు ఫారిన్ సెలబ్రిటీలు కాపీ చేసిన వీడియోలు, ఫొటోలు ఆ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. అంతే కాకుండా పుష్పలో అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యి ఎంతోమంది విదేశీయులు.. అభిమానులుగా కూడా మారిపోయారు. తాజాగా ఆయన ఫ్యాన్స్ జాబితాలోకి వరల్డ్ ఫేమస్ డీజే మార్టిన్ గారిక్స్ చేరారు ! శనివారం హైదరాబాద్‌లో మార్టిన్ గారిక్స్ మ్యూజిక్ కాన్సెర్ట్ జరిగింది. ఈ మ్యూజిక్ కాన్సెర్ట్‌లో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు. గారిక్స్‌తో కలిసి స్టేజ్‌పై పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ పాటకు అల్లు అర్జున్ డ్యాన్స్ చేశారు. అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప సినిమా పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను గారిక్స్ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ గారిక్స్ పోస్ట్ చేసిన వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. బన్నీ క్రేజ్ అంటే ఇదీ అని కామెంట్లు పెడుతున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన మార్టిన్ గారిక్స్ వరల్డ్ టాప్ 100 డీజేల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. యానిమల్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్‌తో పాటు ఆయన స్వరపరచిన ఎన్నో ఆల్బమ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.
ఇంటర్నేషనల్ డీజేతో 'ఊ అంటావా' సాంగ్‌కు బన్నీ స్టెప్పులు !
March 05, 2023
0
Tags