జమ్మూ కశ్మీర్ ‭లో ఘర్ వాపసీ !

Telugu Lo Computer
0


జమ్మూ కశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ ‭ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన పార్టీలో చేరిన నేతలు తాజాగా ఘర్ వాపసీ చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేడా సమక్షంలో కొందరు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జమ్మూ కశ్మీర్ ‭లో కొనసాగున్న నేపథ్యంలో వీరంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రి పీర్జాదా మహమ్మద్ సయీద్, ముజఫర్ పరయ్, బల్వన్ సింగ్ సహా సీనియర్ నేతలు శుక్రవారం కాంగ్రెస్‭లో చేరారు. గులాం నబీ ఆజాద్ స్థాపించిన డెమొక్రటిక్ ఆజాద్ పార్టీలో వీరంతా సభ్యులు. కొద్ది రోజుల క్రితం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ ఆజాద్‭ ను కాంగ్రెస్ తొలగించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)