టిఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్రం

Telugu Lo Computer
0


ఉపా చట్టం కింద 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ' (టిఆర్‌ఎఫ్‌) ను ఉగ్రవాద సంస్థగా కేంద్రం ప్రకటించింది. రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ కమాండర్‌ షేక్‌ సజ్జద్‌ గుల్‌ను కూడా ఉగ్రవాదిగా ప్రకటించినట్లు గురువారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జమ్ముకాశ్మీర్‌ పౌరులు, భద్రతా బలగాలపై దాడులు చేశారంటూ రిసెస్టిన్సె సంస్థకి చెందిన సభ్యులపై పలు కేసులు నమోదైనట్లు పేర్కొంది. అలాగే నిషేధిత ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు అందిస్తున్నట్లు తేలిందని పేర్కొంది. ఆన్‌లైన్‌ ద్వారా యువతను ఉగ్రవాదులుగా నియమించుకుంటుందని, ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సహాయం అందిస్తోందని తెలిపింది. పాకిస్థాన్‌ నుండి జమ్ముకాశ్మీర్‌లోకి డ్రగ్స్‌, ఆయుధాలు అక్రమ రవాణా చేస్తోందని కేంద్రం పేర్కొంది. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ పరోక్ష సంస్థగా రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ 2019లో వెలుగులోకి వచ్చింది. జమ్ముకాశ్మీర్‌లో ఐదుగురు పౌరుల హత్యకు తాము బాధ్యత వహిస్తున్నట్లు 2021లో ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)