విశాఖ చేరుకున్న ఎంవీ జీసీఎల్‌ సబర్మతి బేబీ కేప్‌ నౌక !

Telugu Lo Computer
0


విశాఖ ఓడ రేవుకు శనివారం 'ఎంవీ జీసీఎల్‌ సబర్మతి బేబీ కేప్‌' పేరున్న బాహుబలి నౌక వచ్చింది. ఈ నౌక పొడవు 253.50 మీటర్లు. వెడల్పు 43 మీటర్లు. ఒకే సారి 1,06,529 టన్నుల బరువైన సరకును తరలించే సామర్థ్యం దీని సొంతం. ప్రస్తుతం సున్నపురాయి లోడుతో ఇక్కడకొచ్చింది. రేవులోని వెస్ట్‌క్వే-1 బెర్త్‌లో దీన్ని విజయవంతంగా నిలిపారు. విశాఖ ఓడ రేవులో ఇంతటి భారీ నౌకను నిలపడం ఇదే తొలిసారని పోర్టు ట్రస్టు ఛైర్మన్‌ కె.రామమోహనరావు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)