నూతన సంవత్సర తొలి రోజే ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.25 మేర పెరిగింది. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లోనూ కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1769కి చేరింది. కోల్‌కతాలో రూ.1870కి లభిస్తోంది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ముంబైలో 1721, చెన్నైలో రూ. 1917కి చేరింది. హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్ రేటు రూ.1973కి చేరింది. ఇక వరంగల్‌లో రూ.2014, కరీంనగర్‌లో రూ.2016.50కి పెరిగింది. విజయవాడలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1947కి పెరిగింది. విశాఖపట్టణంలో 1819 రూపాయలకు అందుబాటులో ఉంది. గృహ అవసరాలకు వినియోగాంచే 14.2 కేజీల సిలిండర్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర
January 01, 2023
0
Tags