బాణసంచా పేలుడుకి భారీ విస్పోటనం

Telugu Lo Computer
0


తమిళనాడు లోని నామక్కల్‌ జిల్లా మోగనూరుకు చెందిన తిల్‌లైకుమార్‌ (35) బాణసంచా వ్యాపారి. ఆయనకు ఓడ పాళయంలో గోడౌన్‌ కూడా ఉంది. మోగనూరు మేట్టు వీధిలోని నివాసంలో భార్య ప్రియాంక (30), కుమార్తె సజనీ (4), తల్లి సెల్వి (55)తో తిల్‌లైకుమార్‌ నివాసం ఉన్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా బాణసంచా వ్యాపారం అధికంగా జరిగే అవకాశం ఉండడంతో శివకాశి నుంచి స్టాక్‌ను శుక్రవారం రాత్రి ఓ మినీ వ్యాన్‌లో మోగనూరుకు తెప్పించాడు. గోడౌన్‌కు తరలించకుండా ఇంటి వద్దే ఓ గదిలో స్టాక్‌ను ఉంచి నిద్రకు ఉపక్రమించాడు. శనివారం వేకువ జామున రెండున్నర గంటల సమయంలో భారీ విస్పోటనం తరహాలో శబ్దాలు రావడంతో జనం నిద్ర నుంచి లేచి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తిల్లైకుమార్‌ ఇంటి నుంచి మంటలు చెలరేగుతుండడంతో అటువైపుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించ లేదు. ఈ ఇంటికి పక్క పక్కనే ఉన్న ఇళ్లలోని వారంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. క్షణాల్లో బాణసంచా మోతకు తోడు గ్యాస్‌ సిలిండర్లు పేలిన శబ్దాలతో స్థానికుల్లో కలవరం బయలు దేరింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. మూడు గంటల పాటు బాణసంచా మోతతో సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. ఎట్టకేలకు అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు శనివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అనుమతి లేకుండా ఇంటిలో బాణసంచా ఉంచడంతో పాటు విద్యుత్‌ స్విచ్‌ బోర్డుల వద్ద టపాకాయల బాక్సులను ఉంచడంతో విద్యుదాఘాతం ఏర్పడి ఉండవచ్చుననే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అలాగే ఆ ఇంట్లో ఉన్న రెండు, పక్కింట్లో ఉన్న మరో రెండు సిలిండర్లు పేలడంతో భారీ విస్పోటనం జరిగినట్లు తేల్చారు. సమాచారం అందుకున్న మంత్రి మందివేందన్, ఎంపీ రాజేష్‌కుమార్, ఎమ్మెల్యే రామలింగం ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రు.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేసియా అందజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)