కొత్త జాతిపిత ఏం ఉద్ధరించారు ?

Telugu Lo Computer
0


బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత దేశ స్వాతంత్ర్యం కోసం వాళ్లు (బీజేపీ, ఆరెస్సెస్) ఏం చేశారని ప్రశ్నించారు. స్వాతంత్ర్య సమరంలో ఆరెస్సెస్ పాత్ర ఏమీ లేదన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో తన తండ్రి పాల్గొన్నారని చెప్పారు. వలస పాలన అంతమైన తర్వాత తాను పుట్టినప్పటికీ, అన్ని విషయాలు తనకు చెప్పారన్నారు. మహాత్మా గాంధీ పాత్రను మనం మర్చిపోగలమా? అని ప్రశ్నించారు. 'కొత్త దేశానికి కొత్త జాతిపిత' - దేశానికి మీరేం చేశారు? చెప్పుకోదగినదేమైనా చేశారా? భారత దేశం ఎలా ప్రగతి సాధిస్తోంది? కేవలం జరిగినది ఏమిటంటే, కొత్త టెక్నాలజీ అభివృద్ధి అయిందన్నారు. మీడియాకు స్వేచ్ఛ లేదన్నారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలు ప్రసారం అవడం లేదన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ దేశానికి ఇద్దరు జాతి పితలు ఉన్నారన్నారు. గత కాలపు భారత దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అని, నూతన భారత దేశానికి జాతిపిత నరేంద్ర మోదీ అని చెప్పారు. దీనిపై శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ, అమృత వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవిస్తుందా? అని ప్రశ్నించారు. నితీశ్ కుమార్ మొదట బీజేపీతో కలిసి బీహార్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది బీజేపీతో తెగదెంపులు చేసుకుని, ఆర్జేడీ, మరికొన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)