వాహన బీమా నిబంధనల్లో మార్పులు !

Telugu Lo Computer
0


భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. సాధారణ బీమా సంస్థలు ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని వసూలు చేసి కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు అయిదేళ్ల పాటు పూర్తిస్థాయి బీమా పాలసీలను జారీ చేయవచ్చు. ఇప్పటి వరకూ కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు అయిదేళ్ల థర్డ్‌ పార్టీ బీమా పాలసీలనే బీమా కంపెనీలు జారీ చేస్తున్నాయి. ఒక ఏడాది మోటారు బీమా పాలసీలకు వర్తించే నో-క్లెయిమ్‌ బోనస్‌ సదుపాయాన్నిదీర్ఘకాలిక మోటారు బీమా పాలసీలకు సైతం అమలు చేస్తారు. అగ్నిప్రమాద బీమా, గృహ బీమా నిబంధనల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇకపై 30 ఏళ్ల కాలానికి గృహ బీమా తీసుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)