ప్రేక్షకులు అందించిన దీవెనలతో కోలుకున్నా !

Telugu Lo Computer
0


గత ఏడాది బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడిన హంసానందిని తాను ఆ మహమ్మారిని జయించానని పేర్కొంది. తనకిది పునర్జన్మలాంటిదని, ప్రేక్షకులు అందించిన దీవెనలతో వ్యాధి నుంచి కోలుకున్నానని తెలియజేసింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది. 'ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ లొకేషన్‌లో ఉన్నా, కెమెరా ముందు నిల్చుంటే జీవితంలోని ఆనందం ఏమిటో తెలుస్తుంది. ఈ రోజు రాత్రి యూనిట్‌ సభ్యుల మధ్య పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసుకోబోతున్నా, మీ అందరి ప్రేమాభిమానాల వల్లే తిరిగి కెమెరా ముందుకు రాగలిగాను' అని హంసానందిని ఆనందం వ్యక్తం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)