జిల్లా పరిషత్‌లన్నీ కైవసం చేసుకున్న బిజూ జనతాదళ్‌

Telugu Lo Computer
0


ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ) 30 జిల్లా పరిషత్‌లకు గాను అన్నిటిని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ పంచాయతీరాజ్ సంస్థల అధ్యక్షుల్లో 70 శాతం మంది మహిళలే ఉండడం విశేషం.అలాగే, 15 జిల్లా పరిషత్‌ల అధ్యక్షులు 40 ఏళ్లలోపు వయస్సువారే. ఈ సందర్భంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 30 జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేసి తమ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. ఒడిశా చరిత్రలో ఇది మొదటిసారని పేర్కొన్నారు. బహుశా దేశవ్యాప్తంగా ఒకే పార్టీ రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయడం కూడా తొలిసారే కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, రాయగడ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సరస్వతి మాఝీ (23) అత్యంత పిన్నవయస్కురాలు. ఆమె తర్వాత 26 ఏళ్ల వయస్సులోనే మల్కాన్‌గిరీ చైర్‌పర్సన్‌గా సమారి టంగుల్ ఎన్నికయ్యారు. వీరితో కలిపి మొత్తం 21 మంది మహిళలు చైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారు.


Post a Comment

0Comments

Post a Comment (0)