16 నుండి 12-15 ఏళ్ళ వయస్సు వారికి కరోనా వ్యాక్సిన్

Telugu Lo Computer
0


మార్చి16 నుంచి 12-15 ఏళ్ళు గల పిల్లలకు కోవిడ్ టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మండవియా వెల్లడించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. పిల్లలు సురక్షితంగా ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. దీంతో పాటు 60 ఏళ్లు దాటినవారందరికీ ముందు జాగ్రత్త డోసు ఇవ్వనున్నట్లు కూడా స్పష్టం చేశారు. 60 ఏళ్లు పైబడిన వారు, పిల్లలు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 60 ఏళ్లు దాటి వ్యాధులన్నవాళ్లకు మాత్రమే కోవిడ్ ప్రికాషన్ టీకాలు ఇచ్చారు. నిపుణులతో మాట్లాడిన తర్వాత 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. 15 ఏళ్ల లోపువారికి హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ తయారు చేసిన కోర్బీవ్యాక్స్ టీకాను ఇవ్వనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)