రెండు రోజుల పాటు సంతాప దినాలు

Telugu Lo Computer
0


భారత రత్న' లతా మంగేష్కర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రెండు రోజులపాటు జాతీయ సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జాతీయ పతాకాన్ని రెండు రోజులపాటు అవనతం చేస్తారు. ఆమె ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ మృతిపట్ల దేశవిదేశాల నుంచి సంతాప సందేశాలు వస్తున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తదితరులు ఆమె మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)