బాలికను హింసించిన పెంపుడు తల్లి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో  తొమ్మిదేళ్ల బాలికపై పెంపుడుతల్లి చిత్రహింసలు పెట్టింది. చిన్న పిల్ల అని చూడకుండా శాడిస్టులా వ్యవహరించింది. బాలాజీనగర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న నాగ వెంటక లక్ష్మిని గత కొంత కాలంగా పెంపుడు తల్లి తీవ్రంగా కొట్టి హింసిస్తోంది. బాలిక స్వస్థలం తాడేపల్లి గూడెం కాగా తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. కన్నతల్లి జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళుతూ మరో మహిళకు పెంచుకోమని ఏడేళ్ల క్రితం అప్పగించింది. ఆ మహిళకు అప్పటికే ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పటికీ ఆడపిల్ల కావాలని వెంటక లక్ష్మిని జంగారెడ్డి గూడెంకు తీసుకువచ్చి పెంచుకుంటోంది. సుమారు మూడేళ్ల క్రితం లక్ష్మి భర్త ధర్మరాజు కనిపించకుండా పోవడంతో బాలికను అనవసరంగా పెంచుకున్నామంటూ భావించి బాలికను చీదరించుకుంటూ హింసిస్తోంది. శనివారం వేడినీళ్లు పోయడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. అయినప్పటికీ కనీసం ప్రాథమిక చికిత్స చేయించకుండా బాలికను బలవంతంగా పాఠశాలకు పంపించింది. అక్కడ బాలిక స్పృహ తప్పి పడిపోయింది. చిన్నారి వంటిపై గాయాలు గమనించిన స్కూలు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించి, పెంపుడు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను చైల్డ్ హోంకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)