ఏపీని హడావుడిగా విభజించారు: మోదీ

Telugu Lo Computer
0


పార్లమెంట్‌ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భాగంగా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ విభజన తీరును తప్పుబట్టారు. ఏపీ, తెలంగాణ వైషమ్యాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్నారు. రాజకీయ స్వార్ధం కోసమే ఏపీని హడావుడిగా విభజించారు. తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు. అయితే విభజన కోసం అనుసరించిన పద్ధతి సరిగా లేదు. కలిసి చర్చిస్తే విభజన ప్రక్రియ సాఫీగా జరిగేది. ఏపీ, తెలంగాణ మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణం. మైక్‌లు కట్‌చేసి పెప్పర్‌ స్ప్రే కొట్టారు. హడావుడిగా చర్చలేకుండానే విభజన బిల్లును ఆమోదిచారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు. కాంగ్రెస్‌ అధికార గర్వం వల్ల సమస్యను జఠిలం చేశారు ఏపీ, తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. విభజన చట్టంపై ఎలాంటి చర్చ జరపలేదు. ఏపీ వల్ల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఆ రాష్ట్రానికి అన్యాయం చేసింది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఓడిపోయింది. తెలంగాణ ఇచ్చినా.. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదు

Post a Comment

0Comments

Post a Comment (0)