ప్రధానికి స్వాగతం పలికిన తలసాని

Telugu Lo Computer
0


ప్రధాని మోదీకి జీఎంఆర్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగం పలికారు. తలసానితో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సైతం ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తొలుత సీఎం కేసీఆర్ ప్రధాని హైదరాబాద్ పర్యటన ఆద్యంతం.. వెంటే ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం కేసీఆర్‌ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లలేకపోయారు. మోదీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడ ఇక్రిశాట్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించనున్నారు. కాగా.. సీఎం కేసీఆర్ ముచ్చింతాల్‌లో జరగనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)