లతా మంగేష్కర్​ ఆరోగ్య పరిస్థితి విషమం!

Telugu Lo Computer
0


లతా మంగేష్కర్​ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ముంబైలోని బ్రీచ్​ క్యాడీ ఆసుపత్రి వైద్యుడు ప్రతీత్​ సంధాని చెప్పినట్లు ఏఎన్​ఐ పేర్కొంది. 92 ఏళ్ల లతా మంగేష్కర్​కు కొవిడ్​ పాజిటివ్​ అని నిర్దారణ  కాగా జనవరి 11న బ్రీచ్​ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్​ ద్వారా న్యూమోనియా కూడా అటాక్​ అయింది. అయితే ఇటీవల లతా మంగేష్కర్‌ కోవిడ్‌ను జయించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ మంత్రి తెలిపారు. న్యూమోనియా నుంచి కూడా కోలుకున్నట్లు వివరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)