ఏపీ మైనింగ్ శాఖ సమ్మె నిషేధం

Telugu Lo Computer
0


ఏపీ మైనింగ్ శాఖలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గనుల శాఖను అత్యవసర సర్వీసుల కింద ప్రభుత్వం పరిగణించింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.  సమ్మెకు వెళ్తే ఎస్మా ప్రయోగిస్తామని గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మంత్రుల కమిటీ, స్టీరింగ్ కమిటీ సభ్యులు భేటీ ప్రారంభమైంది. ఆర్థికపరమైన అంశాలపై ఇవాళ క్లారిటీ ఇస్తామని మంత్రుల కమిటీ చెబుతోంది. హెచ్ఆర్ఏ, సీపీఏ, ఐఆర్, రికవరీ, పెన్షనర్ల క్వాంటమ్ పెన్షన్లు ప్రధానంగా డిమాండ్లుగా స్టీరింగ్ కమిటీ సభ్యులు మంత్రుల కమిటీ ముందు ఉంచారు. సాయంత్రం సీఎం జగన్ తో స్టీరింగ్ కమిటీ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)