కూరగాయల ధరలు ఆకాశాన్నంటతున్నాయి. ఇప్పటికే బీరకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి, వంకాయ, టమాటా ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సెంచరీ దాటిన టమాటా ధరలు ఇప్పుడిప్పుడే కొద్ది మేర తగ్గుముఖం పడుతుండగా.. తాజాగా మునక్కాయ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. శుభకార్యాల్లో మునక్కాయ సాంబారు లేకుంటే ఏం బాగుంటుంది? అందువల్లే పెళ్లిళ్ల సీజన్ వస్తే మునగ ధర చెట్టెక్కి కూర్చుంటుంది. చిక్కబళ్లాపుర మార్కెట్లో కేజీ మునక్కాయలు రూ. 400 ధర పలుకుతున్నాయి. చలి కాలం కావడం, పెళ్లిళ్లు ప్రారంభం కావడంతో మునగకు డిమాండ్ పెరిగింది. అతివృష్టి వల్ల మునగ పంట దెబ్బతినడంతో వ్యాపారులు పూణె నుంచి తెప్పిస్తున్నారు.
కేజీ మునక్కాయలు రూ. 400 !
December 08, 2021
0