కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ఇండియన్ 2 ( భారతీయుడు 2). 1996లో వచ్చిన భారతీయుడు సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై సంచలన విజయం అందుకుంది. కమల్-శంకర్ కెరీర్లో ది బెస్ట్ మూవీ అనిపించుకుంది. దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్నది 'ఇండియన్ 2'. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచీ ఇందులో పని చేస్తున్న టీమ్ లో ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. కీలక పాత్రలో నటించిన నెడిముడి వేణు అనారోగ్యంతో చనిపోగా, ఆ తర్వాత వివేక్ హార్ట్ ఎటాక్ తో కన్ను మూశాడు. ఇక ఆ మధ్య ఫ్లోర్లో క్రేన్ల మధ్య షూటింగ్ చేస్తుండగా క్రేన్ కూలి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కి చెందిన వారు మృతి చెందారు. దీంతో ఈ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. భారీ అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనున్న మూవీ విషయంలో వరుస అవాంతరాలు మూవీ టీమ్ ని మాత్రమే కాదు అభిమానుల్ని కలవరపరచాయి. తాజాగా కాజల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో మరో హీరోయిన్ కోసం వేట మొదలెట్టిన దర్శకుడు శంకర్ తమన్నాని ఫైనల్ చేసినట్టు టాక్. కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ తమన్నాకు దక్కింది. ఇప్పటికే సినిమా పూర్తిచేయాలంటూ నిర్మాత కోర్టు వరకూ వెళ్లడంతో మళ్లీ పనిలో వేగం పెంచాడు శంకర్. వీలైనంత తొందరగా ఇండియన్ 2 పూర్తిచేసే ఆలోచనలో ఉన్నారు. . సినిమా పూర్తి చేయడం కోసం నిర్మాత కోర్టు దాకా వెళ్లడంతో మనసు మార్చుకున్న శంకర్ ఈ మూవీని పూర్తి చేసే పనిలో వేగం పెంచారు. ప్రస్తుతం శంకర.. రాంచరణ్ 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది తమన్నా. రీసెంట్ గా 'సీటీమార్', 'మ్యాస్ట్రో' చిత్రాలతో వచ్చి మెప్పించింది. శంకర్ ప్రాజెక్టు ఒకే అయితే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించే క్రేజీ ఆఫర్ తమన్నా ఖాతాలో పడినట్టే !.