తమిళనాడు నీలగిరి కొండల్లో కుప్పకూలిన హెలికాప్టర్ ప్రమాద ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులికా రావత్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఈ హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణించగా, 13 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మిగిలిన ఒకరు 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆ వ్యక్తి బిపిన్ రావత్ అని సమాచారం. తమిళనాడులోని కోయంబత్తూరు – కూనూరు మధ్య హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఘటనాస్థలిలో మృతదేహాలు ముద్దముద్దలుగా మారిపోయాయి. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు మాడిమసైపోయాయి. డీఎన్ఏ టెస్టు ద్వారా మృతదేహాలను గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను కూనూరు ఎయిర్‌బేస్‌లోని వెల్లింగ్‌టన్ ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో రావత్‌కు ముగ్గురు డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
మధులిక రావత్ మృతి
December 08, 2021
0