24 వేల సంత్సరాల తరువాత.......!

Telugu Lo Computer
0

 

గతంలో భూమిపై సంచరించిన డెల్లాయిడ్ రాటిఫర్ అనే సూక్ష్మ బహు కణ జీవి 24 వేల సంత్స రాల తరువాత మరలా కనిపించింది.  ఈ జీవి సైబీరియాలో కనిపించింది. ఇన్నేళ్లు ఇది ఘనీ భవించ ఉందని, ఇప్పుడే మళ్లీ ప్రాణం పోసుకుందని ఇటీవల ఒక పరిశోధనలో కనుగొన్నారు.

మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలిగే అతి చిన్న జలచరం 'డెల్లాయిడ్ రాటిఫర్' (జలగ లాంటి జీవి). ఇంత చిన్న జీవిలోనూ అనేక కణాలు ఉంటాయి. ఇది చూడ్డానికి జలగలా ఉంటుంది.

ఈ జీవిని రష్యన్  శాస్త్రవేత్తలు ఆర్కిటిక్‌లో ఉన్న అలేజా నదిలో కనుగొన్నారు. దాని చుట్టూ ఉన్న మంచు కరిగి, మళ్లీ కొత్త ఊపిరిలూదుకున్న తరువాత ఈ జీవి ప్రత్యుత్పత్తి చేయగలిగింది.ఇలా ఘనీభవించిన స్థితిలో ఉండడాన్ని క్రిప్టోబయోసిస్ అంటారు. ఈ డెల్లాయిడ్ రాటిఫర్‌కు ఉన్న ప్రత్యేక గుణం ఏమిటంటే వీటిలో మగజీవులు ఉండవు. ఆడజీవులు మాత్రమే ఉంటాయి. ఆడజీవుల్లో ప్రత్యుత్పత్తికి అవసరమైన అండాలు విడుదల అయి, మగజీవి సహాయం లేకుండా వాటంతట అవే పిల్లల్ని కనగలుగుతాయి. ఇవి గడ్డకట్టుకు పోయిన స్థితిలో 10 ఏళ్లు బతకగలగవని గత పరిశోధనల్లో తేలింది. ఇవి ఈ స్థితిలో వేల సంవత్సరాలు బతకగలవని ఈకొత్త అధ్యయనంలో తేలింది.ఈ పరిశోధన ఫలితాలను  'కరంట్ బయాలజీ'లో ప్రచురించారు.


    

Post a Comment

0Comments

Post a Comment (0)