మధుమేహం - బంగాళాదుంపలు

Telugu Lo Computer
0


వైద్యుల సలహా మేరకు మధుమేహం ఉన్నవారు బంగాళాదుంపలకు దూరంగా ఉండాలి. అప్పుడప్పుడు తినవచ్చు కానీ రోజూ తినడం మంచిది కాదని చెప్తున్నారు. బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు.. రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. ఇది మధుమేహం రోగులకు ప్రమాదకరంగా ఉంటుంది. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత గ్లూకోజ్ గా మారుతుంది. క్రమం తప్పకుండా బంగాళాదుంపలు తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరగవచ్చు. బంగాళాదుంపలు తిన్న తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలు వెంటనే పెరిగిపోతాయి. వీటిని తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు ఎక్కువ అవుతాయి. బంగాళదుపంలకు బదులుగా పాలకూర, మెంతి వంటి ఆకుకూరలు మంచివట. బ్రోకలీ, క్యాలిఫ్లవర్​లో కార్బ్స్ తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి వాటిని డైట్​లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటితో పాటు టొమాటోలు, దోసకాయలను సలాడ్ల రూపంలోనూ హోల్ గ్రైన్స్, బ్రౌన్ రైస్ కూడా బ్యాలెన్స్డ్ డైట్​లో భాగంగా తీసుకోవాలని చెప్తున్నారు. డైట్లో ఈ మార్పులు చేయడంతో పాటు రోజూ వ్యాయామం చేయాలి. తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించడం కూడా అంతే ముఖ్యం. నీటిని తగిన మోతాదులో శరీరానికి అందించాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)