అంజీర్‌లో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుంది. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఈ పండ్లను వైద్యులు కూడా తినమని సూచిస్తున్నారు. రాత్రి రెండు నల్ల అత్తిపండ్లు నానబెట్టి, ఉదయం పరగడుపున తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రుచికరమైన బ్లాక్ గార్లిక్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. యాంటీబాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలతో ఇది శరీరాన్ని రోగాల నుండి కాపాడుతుంది. ప్రోటీన్ లోపాన్ని తగ్గించడంలో మినుములు అద్భుతం. వీటిలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ B6, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. గుండె, నాడీ వ్యవస్థకు ఇవి బలాన్ని ఇస్తాయి. ప్రోటీన్, ఫైబర్, ఐరన్, విటమిన్ C వంటి అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. రక్తహీనత, గుండె సమస్యలు, ఎముకలు, జుట్టు, చర్మం - అన్నింటికీ ఇది ఎంతో మేలు చేస్తుంది. వైట్ రైస్‌కు బదులుగా బ్లాక్ రైస్ తీసుకోవడం ఉత్తమం. ఇందులో పీచు, ప్రొటీన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఒత్తిడి తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
బ్లాక్ ఫుడ్స్ - ఆరోగ్య ప్రయోజనాలు
August 25, 2025
0
Tags