ప్రకృతి మనకు అనేక రకాల పండ్లను అందిస్తోంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో కొన్ని మనకు తెలిసినవైతే, కొన్ని తెలియనివి కూడా ఉంటాయి. అలాంటి అరుదైన వాటిలో బంక నెక్కెర కాయ (గ్లూ బెర్రీ) అనే పండు ఒకటి. ఇది గమ్‌లా జిగురుగా ఉండే ఈ పండు అడవుల్లో సహజంగా దొరుకుతుంది. పల్లెటూరులో సహజం పెరిగే ఈ చెట్టు కాయల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. దీనిలో కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, క్రూడ్ ఫైబర్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫాస్పరస్ ఉంటాయి. ఈ చెట్టు దాదాపు నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ పండు చూడడానికి ఆకుపచ్చ, పింక్, పసుపు రంగుల్లో ఉంటుంది. ఆరోగ్య పరంగా చూస్తే ముఖ్యంగా 40 ఏళ్లు దాటినవారికి ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది మోకాళ్ళ నొప్పులకు మంచి మందు. మోకాళ్ళల్లో గుజ్జు తరిగిపోతే ఈ పండు తిన్నవాళ్ళకి సహజంగానే పెరుగుతుంది. గ్లూ బెర్రీ గుజ్జును తలకు మర్దన చేస్తే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుందంటున్నారు. కాకరకాయలనే ఇది కూడా షుగర్ రోగులకు మంచి మందు. ఈ కాయలను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాకుండా ఈ పండు మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది శరీరానికి సహజ శక్తిని అందించి, రోగనిరోధకతను పెంచుతుంది. ఇది ఒక నాచురల్ వయాగ్రా. ఇది రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని, శృంగార సమస్యలను దరిచేరనివ్వదని ఆయుర్వేదం పేర్కొంటోంది. గుజరాతీయులు ఈ పండుతో నిల్వ పచ్చడి పెట్టుకుంటారు.
బంక నెక్కెర కాయ (గ్లూ బెర్రీ) - ఆరోగ్య ప్రయోజనాలు
July 19, 2025
0
Tags