సిరియా రాజధాని డమాస్కస్‌లోని సైనిక ప్రధానకార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అలాగే ఇజ్రాయెల్ సైన్యం రక్షణశాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని సిరియన్ సైనిక వర్గాలు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించాయి. ''కొద్దిసేపటి క్రితం డమాస్కస్‌లోని సైనిక ప్రధానకార్యాలయ ప్రవేశద్వారం వద్ద దాడి చేశాం'' అని ఐడీఎఫ్ తన ప్రకటనలో పేర్కొంది. సిరియాలో స్వెయిదా ప్రాంతంలో స్థానిక మిలీషియాల మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్ మిలీషియాకు, సున్నీ బెడ్విన్ తెగలకు మధ్య ఆదివారం తొలుత ఈ సాయుధ ఘర్షణ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది ద్రూజ్ జాతీయులు ఉండగా అందులో సగం మంది సిరియాలో ఉన్నారు. మిగిలినవారు ఇజ్రాయెల్, లెబనాన్‌లలో ఉన్నారు. ద్రూజ్ జాతికి చెందిన ఒక కూరగాయల వ్యాపారిని కొందరు సాయుధులు దోచుకోవడంతో సమస్య ప్రారంభమైందని అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపింది.
సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
July 16, 2025
0
Tags