వరల్డ్ స్నేక్ డే రోజు పాము కాటుకు గురై మరణించిన స్నేక్ క్యాచర్ !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జేపీ కాలేజీలో దీపక్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇతను ఇప్పటి వరకు వేలాది పాముల ప్రాణాలు కాపాడాడు. ఒక పాము స్థానికంగా ఇంట్లో బైట పడటంతో వెంటనే దీపక్ కు కాల్ చేశారు .అక్కడకు వెళ్లి పామును పట్టుకున్నాడు. అయితే దాన్ని ప్రత్యేకంగా ఒక బాక్స్ లో పెట్టుకొకుండా తన మెడలో వేసుకుని స్టంట్ లు చేశాడు. దీంతో ఆ పాము అతడ్ని కాటు వేసింది. దీంతో అతను వెంటనే విలవిల్లాడిపోయాడు. అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే విషం అంతా అతని శరీరంలో వ్యాపించింది. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ దీపక్ చనిపోయాడు. వరల్డ్ స్నేక్ డే రోజున కాపాడిన పాము చేతిలోనే స్నేక్ క్యాచర్ చనిపొవడం స్థానికంగా కలకలంగా మారింది. మరోవైపు దీపక్ కు ఇద్దరు కుమారులు రౌనక్ (12), చిరాగ్ (14) ఉన్నారు. వారు ఇప్పుడు అనాథలుగా మారిపోయారు. అతని భార్య గతంలోనే మరణించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)