వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే తమ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నాడీఎంకే వెల్లడించింది. ''మా కూటమి గెలుస్తుంది. కానీ అన్నాడీఎంకేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మా పార్టీనే కూటమికి నాయకత్వం వహిస్తోంది. ఇది నా నిర్ణయం. నేనే ముఖ్యమంత్రిని అని భాజపా స్పష్టం చేసింది. ఇంకా అంతకుమించి ఏం కావాలి'' అని అన్నాడీఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఇ.పళనిస్వామి వ్యాఖ్యలు చేశారు. 2019లో జరిగిన సార్వత్రిక, 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, భాజపా కలిసిపోటీ చేశాయి. అయితే తమ అధినేత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కె.అన్నామలై భాజపా రాష్ట్ర సారథిగా ఉంటే తాము 'ఎన్డీయే'లో ఉండబోమని 2023లో ప్రకటించిన అన్నాడీఎంకే, 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కూటమి నుంచి బయటికొచ్చి విడిగా పోటీ చేసింది. కానీ ఆ చీలిక డీఎంకేకు బాగా లాభించింది. తమిళనాట ఒంటరిగా ఎదుగుదామని ఆశించిన భాజపాకు ఆ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. ఈ నేపథ్యంలో అన్నామలైను రాష్ట్ర సారథి బాధ్యతల నుంచి భాజపా తొలగించింది. సుదీర్ఘ చర్చల తర్వాత అన్నాడీఎంకేతో తిరిగి పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తు విషయంలో భాజపా అగ్రనేత అమిత్‌షా కీలకంగా వ్యవహరించారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమిని ఓడించి అధికారంలోకి రావాలని ఈ భాగస్వామ్య పక్షాలు ఎత్తులు వేస్తున్నాయి. ఈ తరుణంలో పళనిస్వామి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే తమ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది !
July 16, 2025
0
Tags