ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు కలిగి ఉండకూడదు : జీ7 దేశాలు సంయుక్తంగా కీలక నిర్ణయం

Telugu Lo Computer
0


రాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు కలిగి ఉండకూడదని జీ7 దేశాలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రాంతీయ అస్థిరత, ఉగ్రవాద కార్యకలాపాలే దీనికి కారణమని పేర్కొన్నాయి. మరోవైపు, తమను తాము రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని మద్దతు తెలిపారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని, సీజ్‌ఫైర్‌కు అంగీకరిస్తే మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గి, గాజాలో శాంతి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు.ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ వెల్లడించారు. ''జీ7 సదస్సులో ట్రంప్‌ చర్చలు జరిపారు. యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో కీలక ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని అమెరికాకు బయల్దేరనున్నారు'' అని లీవిట్ పేర్కొన్నారు. ఈ సదస్సులో సోమవారం సాయంత్రం జీ7 సభ్య దేశాల నేతలతో ట్రంప్‌ గ్రూప్‌ ఫొటో దిగారు.

Post a Comment

0Comments

Post a Comment (0)